Telangana: సీఐడీ విషయం కాస్త చూడండి.... తెలంగాణ సీఎస్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

  • తెలంగాణ సీఐడీపై ఫిర్యాదు చేసిన ఫోరం
  • సీఐడీపై ప్రజల్లో నమ్మకం పోతోందని విమర్శలు
  • నానాటికీ పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోందని వెల్లడి

తెలంగాణ సీఐడీ పోలీసుల పనితీరుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. గతంతో పోలిస్తే చాలా కేసులు సీఐడీ వద్ద పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించింది. సీఐడీపై ప్రజల్లో నమ్మకం పోతోందని పేర్కొంది.

తెలంగాణ ఏర్పడినప్పుడు 242 కేసులు పెండింగ్ లో ఉంటే, ఇప్పుడు పెండింగ్ కేసుల సంఖ్య 403కి చేరిందని ఫోరం గుర్తుచేసింది. సీఐడీకి నిధులు పెరుగుతున్నాయే తప్ప, కేసుల ఛేదనలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించింది. ఏళ్లు గడుస్తున్నా ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం కేసును ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారని తన లేఖలో ఆరోపించింది. సీఐడీ పనితీరును సమీక్షించాలని సీఎస్ ను ఫోరం ఈ లేఖలో కోరింది.

More Telugu News