KCR: అందుకే కేసీఆర్‌ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్

  • అసదుద్దీన్‌ ఒవైసీతో మిత్రత్వం కోరుకుంటున్నారు
  • సీఏఏను అడ్డుకోవడమంటే పాక్ ముస్లింలకు పౌరసత్వం కోరడమే
  • పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారు 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో మిత్రత్వం కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈ రోజు ఆయన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మీడియాతో మాట్లాడుతూ... సీఏఏను అడ్డుకోవడమంటే పాకిస్థానీ ముస్లింలకు మనదేశ పౌరసత్వం కోరడమేనని అన్నారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారని లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భైంసాలో టీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలే బీజేపీకి పెద్ద బలమని ఆయన అన్నారు.

More Telugu News