Corona Virus: కరోనా వైరస్ తో కోటి మంది చస్తారా? ఈ మహమ్మారిని బ్రహ్మంగారు ముందే ఊహించారా?

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం
  • కోరంకి అనే జబ్బు కోటి మందికి తగులుతుందంటూ పద్యంలో పేర్కొన్న వైనం
  • పెనుముప్పు తప్పదంటున్న నెటిజెన్లు

చైనాలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ దేశంలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. దీంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ హైఅలర్ట్ ప్రకటించింది. చైనా నుంచి వస్తున్న ప్రయాణికులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మెడికల్ చెకప్ లు చేస్తున్నారు.

చైనాలో ఎంతో మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఎందరో విద్యార్థులు కూడా ఉన్నారు. వారెవరినీ చైనా స్వదేశానికి పంపడం లేదు. వైరస్ తగ్గుముఖం పట్టేంత వరకు దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది. మరోవైపు సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ వైరల్ అవుతోంది. అదే పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం. కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారికి ముందే తెలుసనేదే ఆ ఇమేజ్ సారాంశం.

కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 114వ పద్యంలో చెప్పారంటూ ఓ ఇమేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఇమేజ్ లో ఏముందంటే...?

"ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది మంది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి
కోడిలాగ తూగి సచ్చేరయా"

ప్రస్తుత పరిణామాలకు, బ్రహ్మంగారు చెప్పినదానికి పోలిక ఉందనే చాలా మంది అంటున్నారు. భారతదేశానికి చైనా ఈశాన్య దిక్కునే ఉంది. కోరంకి అనే జబ్బు కరోనా వైరస్ పేర్లు రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. అందుకే బ్రహ్మంగారు చెప్పింది జరగబోతోందనే పెద్ద సంఖ్యలో నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే పెనుముప్పు తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏం జరగబోతోందో వేచి చూడాలి.

More Telugu News