YSR KAPU NESTAM: ఈ ఏడాది నుంచే 'వైఎస్సార్ కాపు నేస్తం': మార్గదర్శకాలు జారీచేసిన ఏపీ ప్రభుత్వం

  • ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి 
  • వాటిపై విచారణ జరపనున్న వలంటీర్లు 
  • ఎంపికైన లబ్ధిదారులకు ఏడాదికి రూ.15 వేలు సాయం

వైఎస్సార్ కాపు నేస్తం' పథకానికి ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం తాజాగా వాటిపై గ్రామవలంటీర్ల ద్వారా విచారణ జరిపి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపడుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాలవలవన్ విడుదల చేశారు.

ఈ పథకం కోసం ఎంపికైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ప్రభుత్వం అందిస్తుంది. 

ఇందుకోసం అబ్ధిదారుల నెలవారీ ఆదాయం గ్రామాల్లో అయితే రూ.10 వేలు, పట్టణాల్లో అయితే రూ.12 వేల లోపు కలిగి ఉండాలి. అలాగే మూడెకరాలు దాటి పల్లం, పదెకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు. నగరాల్లో 750 చదరపు అడుగులకు మించి ఇల్లుండకూడదు.

కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు), ఆదాయ పన్ను చెల్లించే వారు ఉండకూడదు. దరఖాస్తు దారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి వారి ఆధార్, కుల, జనన ధ్రువీకరణ, బ్యాంకు ఆదాయ పత్రాలను, ఆస్తుల వివరాలను పరిశీలించి అర్హతను గుర్తిస్తారు. అన్ని అర్హతలు ఉన్న వారిని పథకం కోసం ఎంపిక చేసి వారి బ్యాంకు వివరాలు తీసుకుంటారు.

More Telugu News