West Bengal: సీఏఏకు వ్యతిరేకంగా బొమ్మలు వేస్తూ.. బెంగాల్ సీఎం మమత నిరసన

  • చిత్రాలను సీఏఏ, ఎన్నార్సీ నిరసనల్లో ప్రదర్శిస్తామన్న దీదీ
  • దేశ వ్యాప్తంగా గ్యాలరీల్లో చిత్రాలను ఉంచుతాం
  • శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని పిలుపు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను నిరసిస్తూ.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బొమ్మలు వేస్తూ.. నిరసన తెలిపారు. ఈ రోజు కోల్ కతాలోని మేయో రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద సీఏఏను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా సీఏఏను వ్యతిరేకిస్తూ కళాకారులు చిత్రాలు గీశారు. మమత కూడా వారితో కలిసి కుంచె పట్టి చిత్రాలు వేశారు.

సీఏఏ, ఎన్నార్సీలపై శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలలో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాక, దేశవ్యాప్తంగా ఉన్న పలు గ్యాలరీల్లో కూడా వీటిని ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తూ మమత బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే.

More Telugu News