Vijay Devrakonda: 'వరల్డ్ ఫేమస్ లవర్' నుంచి మరో సాంగ్!

  • ప్రేమకథాంశంతో క్రాంతిమాధవ్ 
  • నలుగురు కథానాయికలతో విజయ్ దేవరకొండ
  • వచ్చేనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా .. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రూపొందింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మించిన ఈ సినిమా నుంచి గతంలో ఒక సాంగ్ ను వదిలారు. రెండవ పాటను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. బొగ్గుగనిలో చిత్రీకరించిన ఈ పాటను రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని తెలియపరుస్తూ వదిలిన పోస్టర్ ను బట్టి, ఇది విజయ్ దేవరకొండ - కేథరిన్ పై చిత్రీకరించిన పాట అని తెలుస్తోంది. గోపీసుందర్ అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఇతర కథానాయికలుగా రాశి ఖన్నా .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లే లైట్ కనిపించనున్నారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News