janasena: బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నేనేమీ మతోన్మాదిని అయిపోను: పవన్ కల్యాణ్

  • బీజేపీ మతోన్మాదుల పార్టీ అయితే  దేశంలో ఇంత భద్రత ఉండదు
  • దేశంలో ఉన్న పార్టీలన్నీ సెక్యులర్ పార్టీలే
  • వైసీపీ వాళ్లు చేసేది ఒకటి, చెప్పేది ఇంకోటి

బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన తానేమీ మతోన్మాదిని అయిపోనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన క్రియశీలక కార్యకర్తలతో ఇవాళ ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సమస్యలు వస్తే అవి పార్టీ పరిధిలోనే మాట్లాడుకుందామని చెప్పారు. బీజేపీ నిజంగానే మతోన్మాదులు ఉన్న పార్టీ అయితే దేశంలో ఇంత భద్రత ఉండదని వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ సెక్యులర్ పార్టీలేనని, వారి వైఖరి మాత్రమే వేరుగా ఉంటుందని అన్నారు.

బీజేపీ సెక్యులర్ పార్టీ కానప్పుడు వైసీపీ సెక్యులర్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు చేసేది ఒకటి, చెప్పేది ఇంకోటి అని, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు ఆ పార్టీ ఓటేస్తుందని, ఇక్కడికొచ్చి దానికి వ్యతిరేకమని చెబుతోందని విమర్శించారు.

More Telugu News