Air India: ఇక ఎయిర్ ఇండియా ప్రైవేటు సంస్థే ?.. బిడ్లు ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన

  • ఆసక్తి వ్యక్తీకరణకు మార్చి 17వరకు గడువు
  • కొనుగోలు సంస్థలు అప్పులు కూడా స్వీకరించాలని నిబంధన
  • సంస్థకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో 18.6 శాతం వాటా

ప్రభుత్వ రంగంలో కొనసాగుతోన్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ  వందశాతం ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన పూర్తి వాటాలను విక్రయించనున్నట్లు ప్రకటిస్తూ.. ఆసక్తి కలవారు ముందుకు రావచ్చని అధికార ప్రకటన విడుదల చేసింది. ఇందుకు మార్చి 17లోగా తమ ఆసక్తిని తెలపాల్సి ఉంటుందని సూచించింది.

అయితే.. కొనుగోలుదారులు సంస్థ ఆస్తులతో పాటు ఎయిర్ ఇండియాకు చెందిన 3.26 బిలియన్ డాలర్ల రుణాలను కూడా స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. దేశ,విదేశాలకు విమానయాన సేవలను అందిస్తున్న ఎయిర్ ఇండియా 20 వేలకు పైగా ఉద్యోగులను కలిగివుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో సంస్థకు 18.6 శాతం వాటా వుంది. 2018లో తన వాటాల్లో మెజారిటీ వాటాలను సింగిల్ బిడ్లో అమ్మడానికి ప్రయత్నం చేసి విఫలమైంది.

More Telugu News