Kobe Brynat: నా ఫేవరెట్ 'బ్లాక్ మాంబా' ఇక లేడు.... కోబీ బ్రయాంట్ మృతిపై కేటీఆర్ స్పందన

  • అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ దుర్మరణం
  • హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూత
  • తీవ్రవిషాదానికి లోనైన కేటీఆర్

ఎన్ బీయే లెజెండ్ కోబీ బ్రయాంట్ మృతిపై యావత్ ప్రపంచం తీవ్ర విషాదానికి లోనైంది. హెలికాప్టర్ ప్రమాదంలో కుమార్తె సహా కోబీ బ్రయాంట్ ప్రాణాలు విడిచిన సంఘటన నివ్వెరపరిచింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.

 "నా ఫేవరెట్ ఆటగాడు కోబీ బ్రయాంట్ ఇక లేడన్న విషయం తెలిసి షాక్ తిన్నాను. ఎంతో వేదనకు గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కన్నీటి నివాళి అర్పిస్తున్నాను" అంటూ తీవ్ర భావోద్వేగాలతో ట్వీట్ చేశారు. అంతేకాదు, కోబీ బ్రయాంట్ రికార్డులను కూడా కేటీఆర్ తన ట్వీట్ లో పొందుపరిచారు.

ఐదుసార్లు ఎన్ బీయే చాంపియన్, రెండు సార్లు ఎన్ బీఏ ఫైనల్స్ లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, నాలుగు సార్లు ఆల్ స్టార్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, రెండు సార్లు ఎన్ బీయే స్కోరింగ్ చాంపియన్, ఎన్ బీఏ స్లామ్ డంక్ చాంపియన్ అంటూ కోబీ బ్రయాంట్ ఘనతలను ఏకరవు పెట్టారు. అంతేకాదు, కోబీ పట్ల గౌరవంతో ఎన్ బీయే జట్టు లాస్ ఏంజెల్స్ లేకర్స్ నెం.8, నెం.24 జెర్సీలను ఎవరికీ కేటాయించడం లేదని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. 'రిప్ బ్లాక్ మాంబా' అంటూ విషాదభరిత ట్వీట్ చేశారు.

అమెరికా బాస్కెట్ బాల్ చరిత్రలోనే మరెప్పుడూ ఇలాంటి ఆటగాడు రాడు అనేంతగా కోబీ బ్రయాంట్ తనదైన ముద్ర వేశాడు. ప్రత్యర్థుల నుంచి బంతిని ఎంతో లాఘవంగా చేజిక్కించుకోవడమే కాకుండా, బాస్కెట్ వద్ద తన చేతిలో నుంచి బంతిని జారనివ్వకుండా రకరకాల విన్యాసాలు (డంక్) చేస్తూ ప్రత్యర్థులను ఏమార్చి పాయింట్లు స్కోర్ చేయడం కోబీ ప్రత్యేకత. అందుకే ప్రత్యర్థులు కోబీని ఆఫ్రికా ప్రమాదకర సర్పం 'బ్లాక్ మాంబా'తో పోల్చుతారు.

More Telugu News