Nani: 'వి' నుంచి సుధీర్ బాబు ఫస్టులుక్

  • ఇంద్రగంటి నుంచి మరో విభిన్న కథా చిత్రం 
  •  కథానాయికలుగా నివేద .. అదితీరావు 
  • మార్చి 25వ తేదీన విడుదల  

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా రూపొందుతోంది. నాని - సుధీర్ బాబు ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ రోజున సుధీర్ బాబు ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్టు ముందుగానే చెప్పారు. అలాగే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి సుధీర్ బాబు ఫస్టులుక్ ను వదిలారు.

'గన్' తో గురిపెట్టిన సుధీర్ బాబు సీరియస్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుధీర్ బాబు లుక్ డిఫరెంట్ గా వుంది. రేపు నాని ఫస్టులుక్ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రక్షకుడుగా సుధీర్ బాబు .. రాక్షసుడు మనస్తత్వం కలిగిన పాత్రలో నాని చేస్తున్నట్టు ఇంతకుముందే చెప్పారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో కథానాయికలుగా నివేదా థామస్ .. అదితీరావు కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News