KVP: కేవీపీ ఎక్స్‌అఫీషియో సభ్యత్వంపై టీ-కాంగ్రెస్‌ పట్టు

  • నేడు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
  • రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ సభ్యుడిగా కొనసాగుతున్న కేవీపీ
  • కానీ దీన్ని అంగీకరించని ప్రభుత్వం

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావుకు ఎక్స్‌అఫీషియో గుర్తింపు విషయంలో కాంగ్రెస్‌ పట్టుదలగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం కేవీపీ తెలంగాణ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. దీనివల్ల ఆయనకు అక్కడి ప్రజాప్రాతినిధ్య సభల్లో ఓటు హక్కు ఉంటుంది. కానీ దీనికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీనిపై కాంగ్రెస్‌ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిన్న రాత్రి సూర్యాపేట కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.

More Telugu News