Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • తమన్నా చేయాలనుకుంటున్న సినిమా 
  • నాగార్జున సినిమాలో బాలీవుడ్ భామ 
  • రవితేజ, శ్రుతి హాసన్ ల 'క్రాక్' అప్ డేట్

 *  తన పదిహేనేళ్ల కెరీర్ లో పలు పాత్రలను పోషించిన అందాలభామ తమన్నాకు ఓ డ్రీమ్ రోల్ వుందట. అదేమిటంటే, పూర్తిగా డ్యాన్స్ ప్రధానంగా సాగే మ్యూజికల్ చిత్రంలో నటించాలన్నది ఆమె కోరిక. మరి, త్వరలో ఆమె కోరిక తీరుతుందేమో చూద్దాం.
*  అక్కినేని నాగార్జున ప్రస్తుతం సాల్మన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తాజాగా కథానాయిక సయామీ ఖేర్ ను ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. సయామీ గతంలో సాయితేజ్ హీరోగా నటించిన 'రేయ్' చిత్రంలో కథానాయికగా నటించింది.
*  తాజాగా 'డిస్కో రాజా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' చిత్రంలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

More Telugu News