Corona Virus: వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్... చైనా కఠిన ఆంక్షలు

  • చైనాలో కరోనా వైరస్ మహమ్మారి
  • పాముల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తున్నట్టు గుర్తింపు
  • వన్యప్రాణుల విక్రయాలపై నిషేధం విధించిన చైనా

ప్రాణాంతక కరోనా వైరస్ పాములు, ఇతర వన్యప్రాణుల నుంచి మానవులకు సోకుతుందని గుర్తించిన తర్వాత చైనా కఠిన ఆంక్షలు విధించింది. పాములు, కప్పలు, మొసళ్లు వంటి జీవుల విక్రయాలను, రవాణాను నిలిపివేయాలని ఆదేశించింది. వన్యప్రాణులు విక్రయాలు జరపరాదంటూ నిషేధం విధించింది. అంతేకాదు, జనావాసాల మధ్యన ఉన్న వన్యప్రాణి పెంపక కేంద్రాలను కూడా దూరంగా తరలించాలని స్పష్టం చేసింది. చైనాలోని రెస్టారెంట్లలో పాములు, కప్పలు, ఇతర సరీసృపాలకు చెందిన మాంసంతో వంటకాలు విరివిగా లభ్యమవుతాయి. దాంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్న భావనతో వాటిపై నిషేధం ప్రకటించారు.

కొన్నిరోజుల క్రితం చైనాలో బయటపడిన కరోనా వైరస్ 56 మందిని బలిగొంది. ఇప్పటివరకు 2 వేల మందికి పైగా ఈ ప్రమాదకర వైరస్ బారిన పడినట్టు గుర్తించారు. ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితుల కోసమే యుద్ధప్రాతిపదికన 1000 పడకల ఆసుపత్రి నిర్మిస్తోంది. ఈ ఆసుపత్రిని కేవలం 10 రోజుల్లోనే పూర్తిచేయాలని చైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

More Telugu News