Telugudesam: ‘తుగ్లక్’ సినిమా క్లిప్సింగ్స్ ..టీడీఎల్పీ సమావేశంలో నవ్వులు!

  • అమరావతిలో ఇవాళ నిర్వహించిన టీడీఎల్పీ సమావేశం
  • ‘తుగ్లక్’, ‘పులకేశి’ చిత్రాల్లోని సన్నివేశాల ప్రదర్శన
  • వైసీపీ పాలన కూడా ఇదే మాదిరి ఉందని విమర్శలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పిచ్చి తుగ్గక్ చర్యలుగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిలో ఇవాళ నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగినట్టు సమాచారం. రెండు సినిమాల సన్నివేశాలను ప్రదర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను పోలుస్తూ ఈ సన్నివేశాలను ప్రదర్శించారు. ఢిల్లీ నుంచి దౌలాతాబాద్ కు రాజధానిని మార్చిన తుగ్లక్ ను గుర్తుచేస్తూ ‘మహ్మద్ బీన్ తుగ్లక్’ సినిమాతో పాటు ప్రజలను హింసించే 83వ రాజు ‘పులకేశి’ చిత్రంలోని క్లిప్సింగ్స్ ను ప్రదర్శించారు. ఈ సన్నివేశాలను తిలకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవ్వుకున్నారు. రాష్ట్రంలో పరిపాలన కూడా ఇదేవిధంగా ఉందని అభిప్రాయపడ్డారు.

More Telugu News