CAA: బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్చగా సాగుతోంది : సీపీఐ

  • పౌరసత్వ చట్టం దుర్మార్గమైనదని చాడా వెంకటరెడ్డి విమర్శ
  • ఈ చట్టంతో ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి అగమ్య గోచరం
  • నిరుద్యోగం, పేదరికాలను పాలకులు పట్టించుకోవడం లేదు

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని సీపీఐ సీనియర్ నాయకుడు చాడా వెంకటరెడ్డి విమర్శించారు. ఇందుకు సజీవ సాక్ష్యం సీఏఏ చట్టం అన్నారు. హైదరాబాద్ లోని ముఖ్దుం భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. జెండా అవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ పౌరసత్వ చట్టం చాలా దుర్మార్గమైనదని, ఈ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ధ్వజమెత్తారు. పాలకులు పేదరికం, నిరుద్యోగం వంటి అసలైన సమస్యలను వదిలేసి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ పౌరహక్కులు హరించుకుపోతున్నాయని విమర్శించారు.

More Telugu News