హైదరాబాద్ లో నేడు 'భారతమాత మహా హారతి'... హాజరు కానున్న పవన్ కల్యాణ్!

26-01-2020 Sun 06:33
  • హెచ్ఎండీఏ మైదానంలో కార్యక్రమం
  • పాల్గొననున్న తమిళిసై, కిషన్ రెడ్డి
  • హారతిని విజయవంతం చేయాలన్న ఆలోచనలో బీజేపీ
నేటి సాయంత్రం హైదరాబాద్ వేదికగా 'భారతమాత మహా హారతి' కార్యక్రమం జరుగనుండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ట్యాంక్ బండ్ సమీపంలోని ఐమాక్స్ థియేటర్ మాల్ పక్కనే ఉన్న హెచ్ఎండీఏ మైదానంలో సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ, జనసేన, భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని నిర్ణయించింది.