అన్ని ఎన్నికల్లో ఓడిపోయాం... అధిష్ఠానం ఇప్పటికైనా ఆలోచించాలి: వీహెచ్

25-01-2020 Sat 21:26
  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి
  • కాంగ్రెస్ కు ఘోర పరాభవం
  • పీసీసీ తప్పులపై సమీక్ష చేయాలని హైకమాండ్ కు సూచన

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అతి తక్కువ మున్సిపాలిటీలు లభించడం పట్ల సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. అసెంబ్లీ, లోక్ సభ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, అన్ని ఎన్నికల్లో ఓడిపోయామని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం ఇప్పటికైనా ఆలోచించాలని, పీసీసీ తప్పిదాలపై సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో అగ్రకులాలకే పెద్దపీట వేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.