Telangana Assembly Results: ‘మున్సి’ పోల్స్ ఫలితాలు: 84 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం

  • కార్పొరేషన్లలో 5 టీఆర్ఎస్ గెలుపు, మరో మూడింట్లో ఆధిక్యం
  • నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ-ఎంఐఎం మధ్య పోటాపోటీ
  • 2727 మున్సిపల్ వార్డుల్లో టీఆర్ఎస్ ఖాతాలో 1,500 
  • కాంగ్రెస్ కూటమికి 495, బీజేపీకి 223, ఎంఐఎంకు 57 స్థానాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలవరకు వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే.. 120 మున్సిపాలిటీలకు గాను 84 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ గెలిచి, మరో 30 మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో ముందుకు సాగుతోంది. మొత్తం 2727 వార్డు స్థానాల్లో టీఆర్ఎస్ 1,500 స్థానాల్లో విజయ దుందుభి మోగించి ముందుకు సాగుతుండగా, కాంగ్రెస్ కూటమి 495 స్థానాలు, బీజేపీ 223, ఎంఐఎం 57 స్థానాలు, ఇతరులు 294 స్థానాలను గెలుచుకున్నాయి. ఇంకా 158 స్థానాల్లో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

మొత్తం 9 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఐదింట్లో టీఆర్ఎస్ విజయం సాధించి, మరో మూడింట్లో ఆధిక్యంలో ఉంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ, ఎఐంఎం మధ్య నువ్వా?నేనా? అన్నట్లు పోటీ కొనసాగుతోంది. ఈ తొమ్మిది కార్పొరేషన్లలోని 325 డివిజన్లకు గాను ఇప్పటిదాకా 243 డివిజన్లలో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిల్లో 116 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ 36 డివిజన్లను గెలుచుకోగా బీజేపీ 42 డివిజన్లలో విజయం సాధించింది. కాగా ఎంఐఎం 8 స్థానాల్లో తన జెండాను ఎగురవేసింది. ఇతరులు 40 డివిజన్లలో గెలుపొందారు.

More Telugu News