Naga Shaurya: నా కాలు విరగడానికి కారణం వాళ్లు కాదు: హీరో నాగశౌర్య

  • అన్బు - అరివు మంచి ఫైట్ మాస్టర్స్ 
  • రియాలిటీ కోసం నేనే దూకేశాను 
  • వాళ్లు చెప్పినా వినిపించుకోలేదన్న నాగశౌర్య  

నాగశౌర్య కథానాయకుడిగా రూపొందిన 'అశ్వద్ధామ' ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ లవర్ బాయ్ గా ఆకట్టుకున్న నాగశౌర్య, ఈ సినిమాలో యాక్షన్ పాళ్లను ఎక్కువగా టచ్ చేశాడు. ఈ సినిమా షూటింగు సమయంలో ఆయన కాలు విరిగింది కూడా. ఆ సంఘటనను గురించి తాజా ఇంటర్వ్యూలో నాగశౌర్య మాట్లాడాడు.

"ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రాధాన్యత ఎక్కువ. అందువల్లనే 'కేజీఎఫ్' సినిమాకి పనిచేసిన అన్బు - అరివు అనే స్టంట్ మాస్టర్స్ ను తీసుకున్నాము. ఓ ఛేజింగ్ సీన్లో నన్ను దూకవద్దనీ .. డూప్ పెడదామని వాళ్లు చెప్పారు. డూప్ అని ప్రేక్షకులు పసిగడితే కథలో నుంచి బయటికి వస్తారని చెప్పేసి, నేనే చేస్తానని అన్నాను. రోప్ కూడా వాడకూడదని అనుకున్నాను. ఆ సీన్లో పరిగెడుతూ 5వ అంతస్తు నుంచి పడిపోయాను. దాంతో కాలు విరిగి కొన్ని రోజుల పాటు బాధ పడవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News