Dy.CM: మండలి రద్దుపై సమగ్ర చర్చ సాగిన తర్వాతే నిర్ణయం: ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా

  • ఛైర్మన్ షరీఫ్ తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు
  • రాష్ట్రాభివృద్ధికి తెచ్చిన బిల్లులను ఛైర్మన్ అడ్డుకున్నారు
  • టీడీపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ తీరుపై వైసీపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా షరీఫ్ తీరుపై డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికోసమే మూడు రాజధానుల బిల్లు పెట్టడం జరిగిందన్నారు. అయితే, దానికి విఘాతం కలిగేవిధంగా ఛైర్మన్ ప్రవర్తించారని విమర్శించారు.

నేడు అనంతపురం పర్యటనకు వచ్చిన బాషా మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఛైర్మన్ తనను ఎవరూ దూషించలేదని, ప్రలోభ పెట్టలేదని చెబుతున్నప్పటికీ.. టీడీపీ నేతలు వైసీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మతాలు, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడం అలవాటుగా మారిందని ఆరోపించారు. మండలి రద్దుపై సమగ్ర చర్చ సాగిన తర్వాతే నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు. మంత్రి బొత్సపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

More Telugu News