శర్వానంద్ హీరోగా 'మహాసముద్రం'?

25-01-2020 Sat 11:05
  • 'ఆర్ ఎక్స్ 100' తో భారీ విజయం  
  • తదుపరి సినిమాకి అజయ్ భూపతి సన్నాహాలు
  • రంగంలోకి శర్వానంద్  
శర్వానంద్ తాజా చిత్రంగా 'జాను' రూపొందుతోంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ తన తదుపరి సినిమాగా 'మహాసముద్రం' చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం.

'ఆర్ ఎక్స్ 100' చిత్రంతో యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ తరువాత 'మహాసముద్రం' కథను సిద్ధం చేసుకున్నాడు. నాగచైతన్య - సమంత జంటగా ఆయన ఈ సినిమాను చేయాలనుకున్నాడు. చైతూ - సమంత ఇద్దరికీ కథ వినిపించడం జరిగిపోయింది. అయితే చైతూకి గల కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యేలా వుందట. అందువలన శర్వానంద్ ను అజయ్ భూపతి సంప్రదించడం .. అయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఇక కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.