Raana: మంచికోసం పోరాడే చెడ్డవాడిగా రానా!

  • రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం'
  • నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే కథ 
  •  కొత్తగా కనిపించనున్న సాయిపల్లవి   

రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికావలసింది. ఆ మధ్య  రానా అనారోగ్యానికి గురికావడంతో ఆలస్యమైంది. మరో నెల రోజుల పాటు చిత్రీకరణ జరిగితే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.

పదిమందికి మంచి జరగాలనే ఉద్దేశంతో పోరాడే చెడ్డ వ్యక్తిగా రానా కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్ర రానా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర కూడా కొత్తగా ఉంటుందనీ, ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుందని అంటున్నారు. రానా - సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ఈ కాంబినేషన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

More Telugu News