China: గబ్బిలాన్ని తిన్న అమ్మాయి... వైరల్ అవుతోన్న వీడియో

  • చైనాలో గబ్బిలం సూప్‌నూ తాగేసిన యువతి
  • కరోనా వైరస్‌ వ్యాప్తికి గబ్బిలమే కారణమని వాదన
  • అయినప్పటికీ గబ్బిలాన్ని తిన్న యువతి

చైనాలో ఓ అమ్మాయి గబ్బిలాన్ని తింటున్నప్పుడు తీసిన వీడియో వైరల్ అవుతోంది. ఓ రెస్టారెంట్‌లో కూర్చున్న ఆమె గబ్బిలంతో చేసిన సూప్‌ను కూడా తాగేసింది. వండిన గబ్బిలాన్ని ఆమె ఎంత ఇష్టంగా తిందంటే.. మాంసమే కాకుండా దాని చర్మాన్ని కూడా తీనేందుకు యత్నించింది. చర్మం తినకూడదని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు చెప్పారు.

చైనాలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు బలిగొని, మరో 600 మందికి వ్యాపించింది. పాము, గబ్బిలాల నుంచే ఈ వైరస్ మనుషులకు వ్యాపించినట్టు పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చైనా యువతి ఇలా గబ్బిలాన్ని తినేసింది. 

More Telugu News