Amaravati: వికేంద్రీకరణ బిల్లుపై వస్తోన్న వార్తలు అవాస్తవం: స్పష్టం చేసిన ఏపీ 'మండలి' ఛైర్మన్‌ షరీఫ్

  • సీఆర్‌డీఏ రద్దుతో పాటు వికేంద్రకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిపోయింది
  • తదుపరి ప్రక్రియ మాత్రమే కొనసాగాల్సి ఉంది
  • బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి ఇంకా వెళ్లలేదన్న ప్రచారం అవాస్తవం
  • ఇక మిగిలింది సెలెక్ట్‌ కమిటీ సభ్యుల ఎంపిక మాత్రమే

ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ఇటీవల శాసన మండలి ఛైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లు ఇప్పటికీ సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లలేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎం.ఎ.షరీఫ్‌ స్పందించారు. వికేంద్రీకరణ బిల్లుపై వస్తోన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

సీఆర్‌డీఏ రద్దు బిల్లుతో పాటు వికేంద్రీకరణ బిల్లు కూడా సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిపోయిందని షరీఫ్ చెప్పారు. అయితే, తదుపరి ప్రక్రియ మొదలు కావాల్సి ఉందని వివరణ ఇచ్చారు. ఇక మిగిలింది సెలెక్ట్‌ కమిటీ సభ్యుల ఎంపిక మాత్రమేనని చెప్పారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి ఇంకా వెళ్లలేదన్న ప్రచారం అవాస్తవమని చెప్పారు.

More Telugu News