YSRCP: నగర పాలక సంస్థ కానున్న 'అమరావతి'.. ఏపీ ప్రభుత్వం చర్యలు

  • తుళ్లూరు మండలంలోని 24 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్
  • ఈ రోజు పెదపరిమిలో గ్రామసభ నిర్వహణ
  • సీఆర్‌డీఏ చట్టం రద్దు సరికాదని తెలిపిన ప్రజలు 
  • గ్రామాన్ని అమరావతి కార్పొరేషన్‌లో కలిపేందుకు తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం.. అమరావతి రాజధానిని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసే దిశగా చర్యలు మొదలు పెట్టింది. తుళ్లూరు మండలంలోని 24 గ్రామాలు, మరో ప్రాంతంలోని మూడు గ్రామాలతో అమరావతి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు పెదపరిమి, వడ్లమాను, హరిశ్చంద్రపురంలో గ్రామసభల నిర్వహణకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ఈ రోజు పెదపరిమిలో గ్రామసభ నిర్వహించింది. సీఆర్‌డీఏ చట్టం రద్దు సరికాదని గ్రామసభలో అధికారులకు ప్రజలు స్పష్టం చేశారు. అయితే, తమ గ్రామాన్ని అమరావతి కార్పొరేషన్‌లో కలిపేందుకు అంగీకరిస్తూ తీర్మానం చేశారు.

More Telugu News