BSP: ఎంపీగా గెలిచి ఎనిమిది నెలలైనా.. ప్రమాణ స్వీకారం చేయలేని బీఎస్పీ నేత అతుల్ రాయ్

  • అత్యాచారం కేసులో అరెస్టయి ఎనిమిది నెలలుగా జైల్లో..
  • పెరోల్ లభించడంతో.. ప్రమాణ స్వీకారానికి సిద్ధం
  • పోలీసులతో 29న ఢిల్లీకి వెళ్లి.. 31న తిరిగి జైలుకు..

లోక్ సభ ఎన్నికలు జరిగి ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచాయి. ఈ ఎన్నికల్లో గెలిచినప్పటికీ.. ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు యూపీకి చెందిన బీఎస్సీ నేత అతుల్ రాయ్. అత్యాచారం కేసులో అరెస్టై గత మే నెల నుంచి జైలుకే పరిమితమయ్యారు. తాజాగా ఆయన పెరోల్ పై బయటకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. రాజకీయ ప్రత్యర్థులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపిస్తున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని ఘోసీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆయన విజయం సాధించారు. అప్పటినుంచి తనకు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆయనకు రెండు రోజుల పెరోల్ మంజారు చేయడంతో ప్రమాణ స్వీకారానికి సమాయత్తమవుతున్నారు. జస్టిస్ రమేష్ సిన్హా ఈ మేరకు అనుమతిని జారీచేస్తూ.. జనవరి 29న ఢిల్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం అనంతరం 31న తిరిగి రావాలని ఆదేశించారు. పోలీసులు కూడా అతుల్ వెంట ఉంటారని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

More Telugu News