Indics: కొనుగోళ్ల జోరు... లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

  • పైకెగబాకిన సూచీలు
  • కొనుగోళ్ల జోరు
  • బ్యాంకింగ్, ఇన్ ఫ్రా రంగాల షేర్లకు డిమాండ్

ఈ వారం ఆరంభంలో చవిచూసిన నష్టాలను భారత స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో భర్తీ చేసుకున్నాయి. ఇవాళ ట్రేడింగ్ ఉత్సాహభరిత వాతావరణంలో సాగడమే అందుకు కారణం. ఉదయం మధ్యస్థంగా కనిపించిన ట్రేడింగ్ క్రమంగా ఊపందుకుంది. కొనుగోళ్లు పెరగడంతో సూచీలు రివ్వున ఎగిశాయి.

దీంతో ఐటీ విభాగం తప్పించి బ్యాంకింగ్, ఇన్ ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాల షేర్ల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. చివరి వరకు ట్రేడింగ్ ఇదే రీతిలో జరగడంతో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 41,613 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం పురోగతి కనబరుస్తూ 67 పాయింట్ల వృద్ధితో 12,248 వద్ద స్థిరపడింది.

అల్ట్రా టెక్ సిమెంట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, యెస్ బ్యాంక్ షేర్లు దూసుకుపోగా, పవర్ గ్రిడ్, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బీపీసీఎల్ షేర్లు నీరసించాయి.

More Telugu News