Pakistan: మరోసారి ఆయుధ పాటవాన్ని ప్రదర్శించిన పాక్... ఎడారి ప్రాంతంలో అణు క్షిపణి పరీక్ష

  • 'ఘజ్నవీ'ని పరీక్షించిన దాయాది దేశం
  • 'ఘజ్నవీ' పరిధి 290 కిలోమీటర్లు
  • ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలు

ఇటీవల స్తబ్ధుగా ఉన్న పాకిస్థాన్ మరోసారి తన ఆయుధ పాటవాన్ని చాటే చర్యకు దిగింది. తన భూభాగంలోని ఎడారి ప్రాంతంలో అణు క్షిపణి 'ఘజ్నవీ'ని పరీక్షించింది. ఘజ్నవీ అణ్వస్త్ర వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న ఈ బాలిస్టిక్ మిస్సైల్ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.

దీని రేంజ్ తక్కువే అయినా అణుబాంబు సంధానత వల్ల ఇది ప్రమాదకర ఆయుధమని రక్షణ రంగ నిపుణులంటున్నారు. పాకిస్థాన్ స్ట్రాటజిక్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం నిర్వహించారు. భారత్ తో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న దశలో పాక్ ఓ అణు క్షిపణి పరీక్షించి చూడడం సాధారణ విషయం కాదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News