CIP: సీఎం జగన్ కు కొత్త పేరు పెట్టిన సీపీఐ రామకృష్ణ

  • జగన్, తుగ్లక్ పేర్లు కలిపి 'జగ్లక్' అంటూ నామకరణం
  • నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్
  • మీడియాపై ఆంక్షలతో పరిపాలన సాగించలేరని హితవు

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను అపహాస్యం చేస్తూ విపక్షాలు ఇప్పటివరకు పిచ్చి తుగ్లక్ తో పోల్చుతుండడం తెలిసిందే. అయితే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ విషయంలో జగన్ కు కొత్త పేరు పెట్టారు. మన సీఎం తుగ్లక్ కాదని 'జగ్లక్' అంటూ జగన్ పేరును తుగ్లక్ పేరును కలిపి కొత్తగా నామకరణం చేశారు. ఇప్పటికైనా జగ్లక్ నిర్ణయాలు ఉపసంహరించుకుని రాజధాని, వెనుకబడిన ప్రాంతాలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 చానళ్లపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, రాజధాని ఆందోళనలకు సంబంధించిన వార్తలు ప్రసారం చేస్తున్నారని మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులతోనే ఫిర్యాదులు చేయించి కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. రిపోర్టర్లపై కేసుల విషయంలో డీజీపీని కలుస్తామని చెప్పారు. మీడియాపై ఆంక్షలతో జగన్ పరిపాలన కొనసాగించలేరని రామకృష్ణ స్పష్టం చేశారు.

More Telugu News