మూడు రాజధానులకు వ్యతిరేకంగా మంగళగిరిలో ప్రజాగర్జన

24-01-2020 Fri 13:28
  • అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతూ మంగళగిరిలో భారీ ర్యాలీ
  • ర్యాలీలో భారీగా పాల్గొన్న మహిళలు, విద్యార్థులు
  • ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన లోకేశ్
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతం మంగళగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, విద్యార్థులు పోటెత్తిన ఈ ర్యాలీలో నల్లజెండాలు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు అనే నినాదాలతో మంగళగిరి హోరెత్తింది. ఈ ర్యాలీలో కిలోమీటర్ల పొడవునా మహిళలు, విద్యార్థులు బారులు తీరి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 'తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమిస్తున్నారో చూడండి' అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.