Hyderabad: అమానవీయం... మానసిక దివ్యాంగులకు చిత్ర హింసలు!

  • వృద్ధాశ్రమం పేరుతో మానసిక దివ్యాంగుల కేంద్రం
  • గొలుసులతో బంధించి...కర్రలతో కొట్టి
  • మమత వృద్ధాశ్రమంపై పోలీసులు కేసు నమోదు

పండుటాకుల సేవా కేంద్రమని బోర్డు పెట్టి మానసిక దివ్యాంగుల కేంద్రాన్ని నడపడమేకాక, వారిపట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న మమత వృద్ధాశ్రమంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌ శివారు కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగారంలో ఉన్న ఈ వృద్ధాశ్రమంలో అనధికారికంగా మానసిక దివ్యాంగుల కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక్కో మానసిక వికలాంగుడి కుటుంబ సభ్యుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. కానీ కనీస వసతులు చూపించడం లేదు సరికదా తామేం చేస్తున్నామో తమకే తెలియని దివ్యాంగుల పట్ల కనీసం మానవత్వం కూడా చూపించడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

అపరిశుభ్ర వాతావరణంలో మానసిక దివ్యాంగులను గొలుసులతో బంధించి వారిని కర్రలతో కొడుతున్నారని పోలీసులు కూడా గుర్తించారు. బాధిత కుటుంబాల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవడమేకాక అనుమతి లేకుండా దివ్యాంగుల కేంద్రాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

More Telugu News