Tirumala: వణికిస్తున్న చలితో తిరుమల రద్దీ అంతంతే!

  • సాధారణ స్థాయి కన్నా తక్కువ రద్దీ
  • 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • నిన్న స్వామిని దర్శించుకున్న 66,417 మంది భక్తులు

చలి తీవ్రత అధికంగా ఉండటంతో తిరుమలలో రద్దీ సాధారణ స్థాయికన్నా తక్కువగానే ఉంది. స్వామి సర్వదర్శనం కోసం ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 4 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి 5 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, నడకదారి భక్తుల దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల వ్యవధిలో దర్శనం చేయిస్తున్నామని తెలిపారు. నిన్న స్వామివారిని 66,417 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ద్వారా 2.87 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు.

More Telugu News