Virat Kohli: న్యూజిలాండ్ పై ప్రతీకారమా.. ఆ ఆలోచనే రాదు: విరాట్ కోహ్లీ

  • ఆ జట్టు ఆటగాళ్లు మంచివారు
  • మైదానంలో నిబంధనలు అతిక్రమించరు
  • రేపు న్యూజిలాండ్ తో భారత్ టీ20 మ్యాచ్

న్యూజిలాండ్ జట్టు మంచి క్రమశిక్షణగల జట్టని.. ఆ జట్టుపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనలే రావంటూ భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించి సంచలనం రేపాడు. కివీస్ జట్టు ఆటగాళ్లందరూ ఎంతో మంచివారని ప్రశంసించాడు. భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రేపు ఆతిథ్య జట్టుతో భారత్ తొలి టీ 20 మ్యాచ్ ఆడనుంది.

ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. కివీస్ జట్టు ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. కివీస్ ఆటగాళ్లు మంచి క్రమ శిక్షణతో కూడిన ఆటగాళ్లన్నారు. మైదానంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించరని చెప్పారు. గత ఏడాది జరిగిన ప్రపంచ్ కప్ లో సెమీస్ కు చేరిన భారత్  న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానమిస్తూ.. న్యూజిలాండ్ పై ప్రతీకారం తీసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. అసలు అటువంటి ఆలోచనలే రావన్నారు.

More Telugu News