Nitish Kumar: వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపో: సొంత పార్టీ నేతపై నితీశ్ కుమార్ ఆగ్రహం

  • ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో చేయి కలిపిన జేడీయూ
  • అభ్యంతరం వ్యక్తం చేసిన జేడీయూ నేత పవన్ వర్మ
  • పార్టీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉందన్న నితీశ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జేడీయూ చేతులు కలపడంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన పవన్ వర్మ అసహనం వ్యక్తం చేశారు. బీహార్ కు వెలుపల కూడా బీజేపీతో జేడీయూ ఎలా చేయి కలుపుతుందని ఆయన ప్రశ్నించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల పేరుతో దేశ వ్యాప్తంగా అశాంతిని బీజేపీ ప్రేరేపిస్తోందని... ఇలాంటి సమయంలో ఢిల్లీలో బీజేపీతో చేయి కలపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ వర్మపై నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉందని... ఇందులో ఎలాంటి గందరగోళం లేదని నితీశ్ కుమార్ చెప్పారు. ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీలో చర్చించాలని... అంతేకాని బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. పార్టీని వదిలి వెళ్లే అవకాశం ఎవరికైనా ఉంటుందని... కావాలనుకుంటే వెళ్లిపోవచ్చని అన్నారు. ఆయనను బాధ పెట్టాలనేది తన ఉద్దేశం కాదని... నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనేనని చెప్పారు.

More Telugu News