AP Legislative Council: అలాంటి శాసనమండలి అవసరమా?: అంబటి రాంబాబు

  • మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం
  • ఇది రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి
  • అభివృద్ధి నిరోధక శక్తిగా శాసనమండలి  

శాసనమండలిలో టీడీపీకి సంఖ్యాబలం ఉండటం వలన రాజ్యాంగపరమైన స్ఫూర్తిని వదిలేసి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకోవాలనో లేక జాప్యం చేయాలనో ప్రయత్నించడం చాలా దురదృష్టకరమైన పరిణామం అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, టీడీపీకి మెజార్టీ ఉంటే బిల్లును తిరస్కరించి పంపవచ్చు లేదా చట్టప్రకారం వారికి ఉన్న పరిధిలో ఏదైనా చేయవచ్చు కానీ, మండలిలో నిన్న డిస్కషన్ అంతా అయిపోయన తర్వాత, ఏవిధమైన అమెండ్ మెంట్ ను మూవ్ చేయకుండా, ఓటింగ్ జరగాల్సిన సమయానికి ఓటింగ్ నిర్వహించకుండా ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేస్తూ చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికం అని మేధావులు లందరూ అంటున్నారని చెప్పారు. ఈ నిర్ణయం దుష్టసంప్రదాయాలకు ప్రారంభోత్సవంలా కనిపిస్తోందని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా అడ్డుకునే కార్యక్రమాన్ని శాసనమండలి అజెండాగా టీడీపీ తీసుకుందని అంబటి విమర్శించారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి అని, అభివృద్ధి నిరోధక శక్తిగా శాసనమండలిని తయారు చేయాలని టీడీపీ భావించడం దురదృష్టకర పరిణామం అని మండిపడ్డారు. అలాంటి శాసనమండలి అవసరమా? అనే విషయాన్ని ప్రజలు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు.

More Telugu News