ice cream: మొట్టమొదటి సారి ఐస్‌క్రీం తిన్న పాప.. అబ్బురపరుస్తోన్న వీడియో

  • టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేసిన తల్లి
  • వైరల్ అవుతోన్న వీడియో
  • ఐస్‌క్రీమ్‌ను గట్టిగా పట్టుకుని ఇష్టంగా తిన్న పాప

మొట్టమొదటి సారి ఐస్‌క్రీం తిన్న ఓ చిన్నారిలో కనపడిన హావభావాలు అబ్బురపరుస్తున్నాయి. తొమ్మిది నెలల తమ పాపను తాజాగా తల్లిదండ్రులు ఐస్‌క్రీం పార్లర్‌కు తీసుకువెళ్లారు. కోన్‌ ఐస్‌క్రీంను కొని పాపకు తినిపిస్తుంటే.. తన  రెండు చేతులతో ‍ఐస్‌క్రీమ్‌ను గట్టిగా పట్టుకుని ఇష్టంగా నాకింది.  

ఆ పాప పేరు బ్లేక్లీ.. ఆమె తల్లి బ్రిటారి జెర్నిగాన్‌ తన టిక్‌టాక్‌ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఆ పాప చాలా ఇష్టంగా ఐస్‌క్రీమ్‌ను తింటున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఆమె హావభావాలు వెలకట్టలేనివిగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News