water tank: 7 లక్షల లీటర్ల భారీ ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వైనం.. వీడియో ఇదిగో

  • పశ్చిమ బెంగాల్‌లో ఘటన
  • నిర్మించిన నాలుగేళ్లకే కూలిన వైనం
  • ఎవరికీ గాయాలు కాలేదన్న అధికారులు

ఏడు లక్షల లీటర్ల సామర్థ్యమున్న భారీ ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. బంకుర జిల్లాలోని సరేంగా ప్రాంత పరిధిలో ఉన్న ఫతేదాంగాలో 2016లో ఈ ట్యాంకును నిర్మించారు.

దీనికి పగుళ్లు వచ్చి, కుప్పకూలే స్థితికి చేరుకుంది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. నిన్న అది కుప్పకూలిపోవడంతో లక్షల లీటర్ల నీళ్లు వృథాగా పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఈ వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా 15 గ్రామాలకు మంచినీళ్లు అందుతున్నాయి.

ఒక్కసారిగా ట్యాంక్‌ కూలిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. మరో ట్యాంకును నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ నీళ్ల ట్యాంకు కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు.

More Telugu News