Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  • ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై సభలో చర్చ 
  • భవిష్యత్తు తరాల్లో మార్పునకు ఇంగ్లిష్ విద్య తప్పనిసరన్న ఎమ్మెల్యే వరప్రసాద్ 
  • ప్రస్తుతం విద్య అనేది సవాలుగా మారిందని వ్యాఖ్య  

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లును అసెంబ్లీలో వైసీపీ సర్కారు ప్రవేశపెట్టింది.  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై సభలో చర్చ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. భవిష్యత్తు తరాల్లో మార్పు రావాలంటే ఇంగ్లిష్ విద్య తప్పనిసరని తెలిపారు.

ప్రస్తుతం విద్య అనేది సవాలుగా మారిందని అన్నారు. అసమానతలు తొలగాలంటే అందరికీ విద్య అవసరమని అన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే అందరికీ విద్యే మార్గమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం మంచి నిర్ణయమన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ విద్య అవసరమని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిపై జగన్‌ తీసుకున్న నిర్ణయం గొప్పదని చెప్పారు.

More Telugu News