Amaravati: బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లాక ఆర్డినెన్స్‌ జారీ కుదరదు: మాజీ మంత్రి యనమల

  • ప్రభుత్వం ఈ పని చేయలేదు
  • సుప్రీం కోర్టు నిబంధనలకు ఇది విరుద్ధం
  • సెలెక్ట్‌ కమిటీ ఏర్పడ్డాక ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చు

రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపినందున ఆ నివేదిక వచ్చే వరకు ప్రభుత్వానికి వేచి చూడడం తప్ప మరో మార్గం లేదని, ఆర్డినెన్స్‌ జారీ అసలు కుదరదని మాజీ మంత్రి, మండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇందుకు కనీసం మూడు నెలల సమయం పట్టొచ్చన్నారు. అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. ఎందుకంటే సెలెక్ట్‌ కమిటీ ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయిస్తే ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుందన్నారు.

ఈరోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లాక ఆర్డినెన్స్‌ తేవడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇక మేము కోరింది మండలి సెలెక్ట్‌ కమిటీనే తప్ప జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీని కాదని, అందువల్ల కమిటీలో టీడీపీ సభ్యులే ఎక్కువ మంది ఉంటారని తెలిపారు. ఇక ప్రభుత్వం మండలినే రద్దు చేద్దామనుకుంటే దానికి భయపడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

More Telugu News