Balakrishna: హీరోలా ఉన్న రోజా పక్కన ఉన్నది ఎవరో తెలియదుగానీ... యాక్....: రామ్ గోపాల్ వర్మ

  • నిన్న మండలిలో బాలయ్యతో రోజా సెల్ఫీ
  • వైరల్ కావడంతో తనదైన శైలిలో స్పందించిన వర్మ
  • రోజా దిష్టిబొమ్మంటూ వ్యాఖ్యలు

నిన్న మండలిలో 3 రాజధానుల అంశంపై రభస జరుగుతున్న వేళ, లాబీల్లో కూర్చుని ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఓ సెల్ఫీ దిగగా, అదిప్పుడు తెగ వైరల్ అవుతోందన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

"వావ్... రోజాగారు ఓ హీరోలా కనిపిస్తున్నారు. ఎవరో పక్కన ఉన్నారుగానీ, నాకు తెలియదు. చూసేందుకు.. యాక్... అనేలా కనిపిస్తున్నాడు. రోజా అందాన్ని తన ముఖంతో ఆయన చెడగొడుతున్నారు. బహుశా అతను రోజా దిష్టిబొమ్మేమో" అని అన్నారు. ఆపై "అందంగా ఉన్న రోజా పక్కన ఈ చిత్రంలో ఉన్నది ఎవరో ఎవరైనా చెప్పగరా?" అని ప్రశ్నించారు. వర్మ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

More Telugu News