Andhra Pradesh: రాజధాని కేసులపై వాదించేందుకు న్యాయవాదికి రూ.5 కోట్ల ఫీజు.. వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • మూడు రాజధానులపై 37 మంది రైతుల పిటిషన్
  • ప్రభుత్వం తరఫున వాదించనున్న మాజీ ఏజీ ముకుల్ రోహత్గీ
  • అడ్వాన్స్ గా రూ.కోటి చెల్లింపు

మూడు రాజధానులపై అమరావతి ప్రాంతానికి చెందిన 37 మంది రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయపోరాటం చేయడానికి వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిపై దాఖలైన ఈ పిటిషన్లతోపాటు అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ విధింపు, పోలీస్ యాక్ట్ 30 అమలు, సీఆర్డీఏ రద్దు తదితర పిటిషన్లపై ప్రభుత్వం తరపున వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించుకుంది.

రోహత్గీకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ.. ప్రణాళిక విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అడ్వాన్స్ గా ఆయనకు కోటి రూపాయలు చెల్లించేందుకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిపై దాఖలైన పిటిషన్లను వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
 

More Telugu News