Andhra Pradesh: రూల్స్ గురించి వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు... మేం అడిగితే సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందే: యనమల

  • రూల్స్ గురించి వైసీపీ వాళ్లు చెప్పనవసరంలేదన్న యనమల
  • మెజారిటీ సభ్యులు ఏంకోరితే చైర్మన్ అదే చేస్తారని వెల్లడి
  • సర్వాధికారం చైర్మన్ దేనని వ్యాఖ్యలు

వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ శాసనమండలిలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. మండలిలో టీడీపీకి బలం ఉండడంతో బిల్లును విజయవంతంగా అడ్డుకున్నారు. అయితే ఆ బిల్లును ఎలాగైనా సెలెక్ట్ కమిటీ ముందుకు పంపాలని టీడీపీ ప్రయత్నిస్తుండగా, అడ్డుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శాసనమండలిలో టీడీపీ ఫ్లోర్ లీడర్ యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మండలి వాయిదా విరామంలో మాట్లాడిన ఆయన, కౌన్సిల్ లో తమకు సంఖ్యాబలం ఉందని, తాము కోరితే బిల్లును సెలెక్ట్ కమిటీ ముందుకు పంపాల్సిందేనని స్పష్టం చేశారు. కావాలనుకుంటే ఈ అంశంపై ఓటింగ్ నిర్వహించుకోవచ్చని అన్నారు. ఎక్కడైనా మెజారిటీ సభ్యులు ఏ అంశం కోరుకుంటే చైర్మన్ దాన్నే పాటిస్తారని స్పష్టం చేశారు. అయినా రూల్స్ గురించి వైసీపీ నుంచి తాము నేర్చుకోవాల్సిన అవసరంలేదని, మండలిలో సర్వాధికారం చైర్మన్ దేనని యనమల ఉద్ఘాటించారు.

More Telugu News