Tollywood: వైష్ణవ్ తేజ్ అరంగేట్రం మూవీ 'ఉప్పెన' లోగో ఇదిగో!

  • సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఉప్పెన
  • రేపు ఫస్ట్ లుక్ విడుదల

మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రంతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సరిపోయేవిధంగా లోగోను రూపొందించారు. ఈ లోగోను సోషల్ మీడియాలో మైత్రీ మూవీమేకర్స్ రిలీజ్ చేసింది. అంతేకాదు, రేపు సాయంత్రం ఉప్పెన నుంచి ఫస్ట్ లుక్ వస్తుందని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నాడు.

More Telugu News