Raviteja: రవితేజ అభిమానులకు ఈ సినిమా ఓ పండుగలా ఉంటుంది: దర్శకుడు వీఐ ఆనంద్

  • రవితేజను దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నాను 
  •  ఆయన కెరియర్లో ప్రత్యేక చిత్రం అవుతుంది
  • ఈ సినిమాతో తన ముచ్చట తీరిందన్న వీఐ ఆనంద్  

విభిన్నమైన కథా నేపథ్యాలను ఎంచుకుని వాటిని తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడం దర్శకుడు వీఐ ఆనంద్ ప్రత్యేకత. ఆయన తాజా చిత్రంగా 'డిస్కోరాజా' రూపొందింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "రవితేజను దృష్టిలో పెట్టుకునే నేను ఈ కథను తయారు చేసుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ఆయన తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రవితేజ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను. రవితేజ సినిమా నుంచి ఆయన అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లకి ఈ సినిమా ఓ పండుగలా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో చేయాలనే నా కోరిక ఈ సినిమాతో తీరింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News