Telangana: పెద్ద అంబర్ పేటలో ఓటుకు రూ.3 వేలు!... ఇద్దర్ని పట్టుకుని చితకబాదిన కాంగ్రెస్ కార్యకర్తలు

  • తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ షురూ
  • ఉదయం 11 గంటల సమయానికి 36 శాతం పోలింగ్
  • పెద్ద అంబర్ పేటలో దొంగఓట్ల కలకలం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 36 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. అయితే హైదరాబాద్ శివారుప్రాంతం పెద్ద అంబర్ పేట వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఓటుకు రూ.3 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని 70 మందితో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాకుండా, దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారంటూ ఇద్దర్ని పట్టుకుని ఉతికారేశారు. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నేత దొంగ ఓట్లు వేయిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 8వ వార్డు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్యుద్ధం జరగ్గా, పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించారు.

More Telugu News