Samantha: 'జాను' విడుదల తేదీ ఖరారు

  • తమిళంలో విజయవంతమైన '96'
  • 'జాను'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు
  • వచ్చేనెల 7వ తేదీన విడుదల

కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన '96' సినిమా వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీ ఏర్పడింది. తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్న 'దిల్' రాజు, శర్వానంద్ - సమంత జంటగా ఈ సినిమాను నిర్మించాడు. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమారే తెలుగులో ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజున 'వరల్డ్ ఫేమస్ లవర్' ఉండటంతో, వారం రోజుల ముందుగానే విడుదల చేస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో ఈ కథ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News