Jagan: మీరు తుగ్లక్ అంటున్నారు.. మేము లోకేశ్ అనే అంటున్నాం: అవంతి

  • తండ్రీకొడుకులు అమెరికా, సింగపూర్ అన్నారు
  • మేము వెనుకబడిన ప్రాంతాల గురించే ఆలోచిస్తాం
  • సీఎంను తుగ్లక్ అనడం ఎంత వరకు సంస్కారం?

వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ శాసనమండలిలో చర్చ హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సభలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై విమర్శలు గుప్పించారు. తండ్రీకొడుకులిద్దరూ అమెరికా, సింగపూర్, చైనా అన్నారని... తాము మాత్రం వెనుకబడిన ప్రాంతాల గురించే ఆలోచిస్తామని చెప్పారు. అమరావతిలో టీడీపీ నేతలు చేసిన భూ దోపిడీ అంతా ఇంతా కాదని అన్నారు.

భీమిలిలో తనపై లోకేశ్ ను పోటీచేయించాలని భావించారని.. నాలుగు సర్వేలు కూడా చేయించారని... అయితే ఓడిపోతానని తెలిసి లోకేశ్ వెనక్కి తగ్గారని అవంతి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ను తుగ్లక్ అని సంబోధిస్తుండటం ఎంత వరకు సంస్కారమని ప్రశ్నించారు. తమకు సంస్కారం ఉండబట్టే మిమ్మల్ని లోకేశ్ అనే సంబోధిస్తున్నామని చెప్పారు. మంచి పనులు చేసుంటే టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు.

More Telugu News