Dhanush: గతంలో తన తల్లి మేనక చేసిన పాత్రలో కనిపించనున్న కీర్తి సురేశ్

  • రజనీ - మేనక జంటగా గతంలో వచ్చిన 'నేత్రిక్కన్'
  • రీమేక్ కి సన్నాహాలు మొదలెట్టిన ధనుశ్ 
  • మరోసారి ధనుశ్ జోడీ కడుతున్న కీర్తి సురేశ్ 

అందాల కథానాయిక కీర్తి సురేశ్, సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచే వచ్చింది. ఆమె తల్లి మేనక గతంలో తమిళ - కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. అప్పట్లో ఆమె రజనీకాంత్ సరసన 'నేత్రిక్కన్' అనే సినిమా చేశారు. ఆ సినిమా రజనీ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఇంతకాలానికి ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ధనుశ్ కి రావడం .. ఆయన రంగంలోకి దిగిపోవడం జరిగిపోయాయి. గతంలో రజనీ చేసిన పాత్రను ధనుశ్ పోషించనుండగా, మేనక ధరించిన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ సినిమాను ధనుశ్ తన సొంత బ్యానర్లో నిర్మించనున్నట్టు చెబుతున్నారు. దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలియజేయనున్నారు. ధనుశ్  - కీర్తి సురేశ్ ఇంతకుముందు 'రైల్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News