Mahesh Babu: 'రమణా లోడెత్తాలిరా ..' డైలాగ్ ఆ స్థాయిలో పేలుతుందని అనుకోలేదు: నటుడు సేతురామన్

  • అనిల్ రావిపూడి గొప్పగా రాశారు 
  • రామ్ లక్ష్మణ్ బాగా కంపోజ్ చేశారు 
  • తన జీవితంలో మరిచిపోలేనన్న సేతురామన్

'సరిలేరు నీకెవ్వరు' సినిమా చూసిన వాళ్లకి, 'రమణా లోడెత్తాలిరా .. చెక్ పోస్ట్ పడతాది' అనే డైలాగ్ బాగా గుర్తుంటుంది. ఫారెస్ట్ లో ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ తో మహేశ్ బాబు ఫైట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు. ఆ సమయంలో ఆ గ్యాంగ్ లీడర్ గా వున్న వ్యక్తి, మహేశ్ బాబును లైట్ తీసుకుంటూ ఈ మాట అంటుంటాడు. ఆ డైలాగ్ చెప్పిన నటుడే సేతురామన్.

ఈ ఒక్క సీన్ తో ఆయన పాప్యులర్ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ... " ఈ సీన్ చేస్తున్నప్పుడు ఈ డైలాగ్ ఈ స్థాయిలో పాప్యులర్ అవుతుందని నేను అనుకోలేదు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ .. అనిల్ గారు రాసిన డైలాగ్ .. నా డైలాగ్ ను మహేశ్ బాబు రిపీట్ చేయడం వలన ఆ సీన్ అంత బాగా వచ్చింది. ఈ పాత్ర ఇంత గుర్తింపు తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. షూటింగు సమయంలో మహేశ్ బాబు నాతో ఆప్యాయంగా మాట్లాడటం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను"అని చెప్పుకొచ్చారు.

More Telugu News