Venkatesh: 'నారప్ప'గా ఆసక్తిని రేకెత్తిస్తున్న వెంకటేశ్

  • తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్'
  • తెలుగు టైటిల్ గా 'నారప్ప'
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ  

మొదటి నుంచి కూడా రీమేక్ ల పట్ల వెంకటేశ్ ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. రీమేక్ చిత్రాల ద్వారా ఎక్కువ సక్సెస్ లను అందుకున్న తెలుగు హీరోగా కూడా వెంకటేశ్ కనిపిస్తారు. ఆయన తాజా చిత్రంగా 'నారప్ప' రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్'కి రీమేక్.

అక్కడ భారీ వసూళ్లను .. ప్రశంసలను అందుకున్న ఆ సినిమా, రీమేక్ గా రీసెంట్ గా ఇక్కడ సెట్స్ పైకి వెళ్లింది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో వెంకటేశ్ లుక్ కి సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. డిఫరెంట్ లుక్ తో వెంకటేశ్ ఈ పోస్టర్స్ లో కనిపిస్తున్నారు. కెరియర్ పరంగా వెంకటేశ్ చేస్తున్న ఈ 74వ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News